భారతదేశం, డిసెంబర్ 15 -- తెలంగాణ తీవ్రమైన చలిగాలులను ఎదుర్కొంటోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 మూడు డిగ్రీల వరకు పడిపోతున్నాయి. డిసెంబర్ 16 వరకు చలి కొనసాగుతుందని ఐఎండీ హెచ్చరిస్తోంది, అయితే ఇండిపెండెంట్ వెదర్ ట్రాకర్ అంచనా ప్రకారం డిసెంబర్ 21 వరకు చలి కొనసాగవచ్చు. రాబోయే 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సోమవారం తెలిపింది.

రాబోయే ఏడు రోజులలో రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ కార్యాలయం పేర్కొంది. గత 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో శీతలగాలుల నమోదయ్యాయి. ఆదివారం, సోమవారం మధ్య రాత్రి ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 7.7 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని నివేదికలో తెలిపింది. ఆసిఫాబాద...