భారతదేశం, డిసెంబర్ 22 -- అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీకి బాక్సాఫీస్ దగ్గర చేదు అనుభవం కొనసాగుతోంది. ఈ సినిమా ఊహించిన దాని కంటే చాలా చాలా వెనుకబడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది వచ్చిన చాలా సినిమాల కంటే వెనకే ఉన్న ఈ సినిమా.. ఏపీ, తెలంగాణాల్లో అయితే మరింత దారుణమైన వసూళ్లతో షాక్‌కు గురి చేస్తోంది.

అవతార్ ఫ్రాంఛైజీకి తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది అభిమానులే ఉన్నారు. ఈ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన రెండో సినిమా అవతార్: ది వే ఆఫ్ వాటర్.. ఏపీ, తెలంగాణల్లో కలిసి రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. కానీ తాజాగా వచ్చిన అవతార్: ఫైర్ అండ్ యాష్ మాత్రం తొలి మూడు రోజుల్లో అంటే ఫస్ట్ వీకెండ్ లో కేవలం రూ.15 కోట్లే రాబట్టడం గమనార్హం.

అది కూడా అన్ని భాషల్లో కలిపి ఈ మాత్రమే వచ్చాయి. 2డీ, 3డీ, 4డీఎక్స్ ఫార్మాట్లలోనూ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రిలీజైంది. కానీ ఇవ...