భారతదేశం, జూన్ 2 -- తెలంగాణతో సహా అనేక రాష్ట్రాలు, కల్తీ విత్తనాల బెడదను ఎదుర్కొంటున్నాయి. ఇది కేవలం వ్యవసాయ ఉత్పత్తిని దెబ్బతీయడం కాదు. అంతకుమించి రైతుల జీవనోపాధిని తీవ్రంగా ప్రభావితం చేస్తూ, వారి ఆశలను చెదరగొడుతోంది. రుతుపవనాలు ఆశలు చిగురింపజేసే వేళ, నకిలీ విత్తనాల వ్యాప్తి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి తీరని నష్టాన్ని కలిగిస్తోంది.

నకిలీ విత్తనాల సమస్య లోతుగా పాతుకుపోయింది. రైతులు, మెరుగైన దిగుబడుల ఆకాంక్షతో, లేదా తక్కువ ధరలకు ఆశపడి, మోసపూరిత వ్యాపారుల వలలో పడుతున్నారు. ఈ విత్తనాలు నాణ్యతలేనివి కావడంతో, పంటలు సరిగా పండవు. దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. తెగుళ్లు, వ్యాధులు ప్రబలడానికి దోహదపడుతుంది. ఫలితంగా, రైతులు తమ పెట్టుబడులు, అప్పుల భారాన్ని మోస్తూ, తీవ్ర నష్టాలకు గురవుతున్నారు.

ఈ సమస్యను అరికట్టేందుకు, రాష్ట్ర ...