Hyderabad, జూన్ 23 -- మిస్టరీ థ్రిల్లర్ సినిమా అభిమానులకు గుడ్ న్యూస్. ఈ వారం ఓటీటీలోకి ఈ జానర్లో ఓ తెలుగు మూవీ రాబోతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 7న రిలీజైన ఈ సినిమా సుమారు ఐదు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుండటం విశేషం. మలయాళ డైరెక్టర్ వినోద్ విజయన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాకపోయినా.. ఐఎండీబీలో మాత్రం 8.4 రేటింగ్ సాధించింది.

ఓటీటీలోకి రాబోతున్న తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఒక పథకం ప్రకారం. సాయిరాం శంకర్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమా శుక్రవారం (జూన్ 27) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని గతంలోనూ వెల్లడించిన ఆ ఓటీటీ తాజాగా సోమవారం (జూన్ 23) కూడా ఓ వీడియో ద్వారా మరోసారి తెలిపింది.

"ఇరికించారు, మోసం చేశారు. అయినా వెనక్కి తగ్గలేదు. అబద్ధాలు, జరిగిన నష్టాలు, నిజం కోసం సాగే పోరాటం చుట్టూ...