భారతదేశం, మే 20 -- ట్రైలర్ వచ్చిన తర్వాత 'భైరవం' సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మల్టీస్టారర్ యాక్షన్ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చింది. ఈ చిత్రం మే 30వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీకి హైప్ రావడంతో నాన్ థియేట్రికల్ హక్కులను మంచి డీల్ జరిగింది. ఓటీటీ, శాటిలైట్ హక్కుల వివరాలు బయటికి వచ్చాయి.

భైరవం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత జీ5లోనే ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెడుతుంది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు టీవీ ఛానెల్ దక్కించుకుంది. మొత్తంగా ఈ మూవీ నాన్ థియేట్రికల్ హక్కులను జీ సంస్థ సొంతం చేసుకుంది.

భైరవం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్, శాటిలైట్ హక్కులు కలిపి సుమారు రూ.32కోట్లకు జీ సంస...