Hyderabad, సెప్టెంబర్ 9 -- సమంత రూత్ ప్రభు నిర్మాతగా మారి తీసిన తొలి సినిమా శుభం (Subham). ఈ ఏడాది మే 9న థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించింది. హారర్ కామెడీ జానర్లో ప్రేక్షకులను బాగా మెప్పించిన ఈ మూవీ ఇప్పుడు టీవీలోకి వస్తోంది. ప్రస్తుతం జియోహాట్‌స్టార్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.

సమంత నిర్మించి అతిథి పాత్రలో నటించిన తెలుగు బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ మూవీ శుభం మొత్తానికి నాలుగు నెలల తర్వాత టీవీలోకి వస్తోంది. వచ్చే ఆదివారం అంటే సెప్టెంబర్ 14న సాయంత్రం 6.30 గంటలకు ఈ సినిమాను టెలికాస్ట్ చేయనున్నట్లు స్టార్ మా ఛానెల్ వెల్లడించింది.

"భయాలు మిమ్మల్ని నవ్విస్తాయి. నవ్వులు మిమ్మల్ని వణికిస్తాయి.. శుభం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ మిస్ కావద్దు. ఈ ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు మీ స్టార్ మాలో" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసిం...