భారతదేశం, ఏప్రిల్ 20 -- ఏపీ సీఎం చంద్రబాబు 75వ పుట్టిన రోజు సందర్భంగా ఎంతో మంది సామాజిక మాధ్యమాల ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం చంద్రబాబు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.

"నా పుట్టినరోజున మీరు అందించిన శుభాకాంక్షలు, మీరు చూపించిన అభిమానం, ఆప్యాయతతో నా మనసు ఉప్పొంగింది. ఇప్పటివరకు నా ప్రయాణంలో నాకు తోడుగా నిలిచినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. 75 ఏళ్ల నా జీవన ప్రయాణంలో, 47 ఏళ్ల నా రాజకీయ ప్రస్థానంలో నాకు ఎల్లప్పుడూ తోడునీడగా ఉండి, నన్ను ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రజాసేవ చేసేందుకు నాలుగోసారి ముఖ్యమంత్రిగా అవకాశమిచ్చిన తెలుగు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇది ఎవరికీ దక్కని అరుదైన గౌరవం, అపురూప అవకాశం" అని సీఎ...