భారతదేశం, ఏప్రిల్ 26 -- నాగ‌చైత‌న్య లీడ్ రోల్‌లో మ‌య‌స‌భ పేరుతో తెలుగులో ఓ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ తెర‌కెక్కుతోన్న‌ట్లుగా కొన్నాళ్లుగా టాలీవుడ్ వ‌ర్గాల్లో పుకార్లు షికారు చేస్తోన్నాయి. ఈ వెబ్‌సిరీస్‌పై డైరెక్ట‌ర్ దేవా క‌ట్టా శ‌నివారం క్లారిటీ ఇచ్చారు. ఈ వెబ్‌సిరీస్‌లో నాగ‌చైత‌న్య న‌టించ‌డం లేద‌ని పేర్కొన్నారు.

మ‌య‌స‌భ వెబ్‌సిరీస్‌లో ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్న న‌టీన‌టులు ఎవ‌ర‌న్న‌ది ట్విట్ట‌ర్ ద్వారా దేవా క‌ట్టా వెల్ల‌డించారు. మ‌య‌స‌భ వెబ్‌సిరీస్‌లో ఆది పినిశెట్టి, చైత‌న్య‌రావు లీడ్ యాక్ట‌ర్స్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు దేవా క‌ట్టా చెప్పారు.

వీరిద్ద‌రితో పాటు సాయికుమార్‌, నాజ‌ర్‌, దిద్యా ద‌త్తా, తాన్య ర‌విచంద్ర‌న్‌, ర‌వింద్ర విజ‌య్‌, శ‌త్రు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. చైత‌న్య‌రావు పేరు చూసి చాలా మంది...