Hyderabad, ఆగస్టు 8 -- ఈటీవీ విన్ ఓటీటీ మరో ఇంట్రెస్టింగ్ తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ సిరీస్ పేరు కానిస్టేబుల్ కనకం. కొన్నాళ్ల కిందట జీ5 ఓటీటీ తీసుకొచ్చిన విరాటపాలెం సిరీస్ ను తమ కథ ఆధారంగానే తెరకెక్కించారన్న వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. తమదే ఒరిజినల్ అని చెప్పుకున్న ఈటీవీ విన్ ఇప్పుడు ఆగస్టు 14 నుంచి కానిస్టేబుల్ కనకం సిరీస్ స్ట్రీమింగ్ చేయనుంది.

కానిస్టేబుల్ కనకం ఓ థ్రిల్లర్ వెబ్ సిరీస్. గతేడాది చివర్లోనే ఈ సిరీస్ ను అనౌన్స్ చేశారు. వర్ష బొల్లమ్మ లీడ్ రోల్లో నటించిన ఈ సిరీస్ ట్రైలర్ ను శుక్రవారం (ఆగస్టు 8) మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగింది. మొత్తం ట్రైలర్ ను ఓ పాట రూపంలో తీసుకురావడం విశేషం. ఓ అడవి, అందులోని క్రూర మృగాలు, ఆ మృగాల మధ్యకు ...