భారతదేశం, డిసెంబర్ 25 -- తెలుగు తెరపై మరో మలయాళీ అందం మెరుస్తోంది. ఇవాళ థియేటర్లలో రిలీజైన ఛాంపియన్ సినిమాతో మరో కేరళ కుట్టీ టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆమెనే హీరోయిన్ అనస్వర రాజన్. సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన ఛాంపియన్ మూవీతో తన బ్యూటీ, యాక్టింగ్ తో అదరగొట్టింది అనస్వర. దీంతో ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకోవాలని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.

ఛాంపియన్ సినిమాలో హీరోయిన్ అనస్వర రాజన్ ఓ మలయాళ భామ. ఆమె 2002లో కేరళలోని కరివెల్లూర్ లో పుట్టింది. సినిమాల్లో అడుగుపెట్టి క్రమంలో మలయాళంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 15 ఏళ్లకే డెబ్యూ చేసింది అనస్వర. 'ఉదాహరణం సుజాత' సినిమాలో మంజు వారియర్ కూతురిగా నటించింది ఈ కేరళ భామ.

తన్నీర్ మతన్ దినంగల్ సినిమాతో అనస్వరకు మరింత గుర్తింపు వచ్చింది. అయితే స్టార్ హీరోయిన్లు కూడా డ్యుయల...