భారతదేశం, డిసెంబర్ 4 -- తెలుగులో టాప్ 10 సీరియల్స్ లిస్టు మరోసారి వచ్చేసింది. ఈ ఏడాది 47వ వారం రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి. ఎప్పటిలాగే స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ టాప్ 10లో చోటు సంపాదించినా.. ఈవారం వాటి స్థానాలు కాస్త అటూఇటూగా మారాయి. ఓవరాల్ గా కొన్ని సీరియల్స్ రేటింగ్స్ కూడా 47వ వారం కాస్త తగ్గాయి.

తెలుగు టీవీ సీరియల్స్ లో స్టార్ మా దూకుడు ఇప్పటిది కాదు. కొన్నేళ్లుగా ఆ ఛానెల్ సీరియల్సే టాప్ లో ఉంటూ వస్తున్నాయి. తాజా రేటింగ్స్ కూడా అందుకు భిన్నంగా ఏమీ లేవు. కార్తీక దీపం 2 సీరియల్ ఈ జాబితాలో తొలి స్థానంలో ఉంది. గత వారంతో పోలిస్తే రేటింగ్ కాస్త తగ్గి.. 15.68గా ఉంది. అంతేకాదు అటు అర్బన్, ఇటు రూరల్ రెండింట్లోనూ నంబర్ వన్ ఈ సీరియలే కావడం విశేషం.

రెండో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు కొనసాగుతోంది. ఈ సీరియల్ కు తాజాగా 14.08 రేటింగ్ నమోదైంది. మూ...