భారతదేశం, నవంబర్ 27 -- స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ కు సంబంధించి ఈ ఏడాది 46వ వారం టీఆర్పీ రేటింగ్స్ రిలీజయ్యాయి. తొలి స్థానంలో కార్తీకదీపం 2 సీరియల్ కొనసాగుతుండగా.. కేవలం అర్బన్ మార్కెట్ రేటింగ్ చూస్తే మాత్రం గుండె నిండా గుడి గంటలు టాప్ లో ఉండటం విశేషం. మరి టాప్ 10లో ఏ సీరియల్ ఎంత రేటింగ్ సాధించిందో చూద్దాం.

తెలుగు టీవీ సీరియల్స్ విషయానికి వస్తే స్టార్ మా ఛానెల్ ఆధిపత్యం కొనసాగింది. అందులోనూ కార్తీక దీపం 2 సీరియల్ దూకుడు కొనసాగుతోంది. వరుసగా రెండో వారం కూడా ఆ సీరియల్ రేటింగ్ 16 దాటడం విశేషం. 46వ వారం ఈ సీరియల్ రేటింగ్ 16.23గా నమోదైంది. ఇక రెండో స్థానంలో ఉన్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా 15.05 రేటింగ్ సాధించింది.

అర్బన్ మార్కెట్ లో 12.35 రేటింగ్ తో తొలి స్థానంలో ఉన్న గుండె నిండా గుడి గంటలు సీరియల్.. ఓవరాల్ గా ఈ వారం మరోసారి మూడో ...