Hyderabad, సెప్టెంబర్ 18 -- తెలుగు టీవీ సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి. వీటిలో ఎప్పటిలాగే కార్తీకదీపం 2 టాప్ లో కొనసాగుతుండగా.. ఈ నెలలో ప్రారంభమైన బిగ్ బాస్ 9 తెలుగు వల్ల తన స్లాట్ కోల్పోయిన స్టార్ మా సీరియల్ నువ్వుంటే నా జతగా టాప్ 10లో నుంచి వెళ్లిపోయింది.

స్టార్ మా ఛానెల్ కు చెందిన సీరియల్స్ టాప్ 10లో ఆరు ఉన్నాయి. నువ్వుంటే నా జతగా సీరియల్ టాప్ 10లో చోటు కోల్పోయింది. తొలి స్థానంలో కార్తీకదీపం 2 నిలిచింది. 36వ వారం ఈ సీరియల్ కు 13.85 రేటింగ్ నమోదైంది. ఇక రెండో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు కొనసాగుతోంది. ఈ సీరియల్ కు 13.04 రేటింగ్ వచ్చింది. మూడో స్థానంలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ నిలిచింది. ఈ సీరియల్ కు అర్బన్, రూరల్ కలిపి 12.35గా ఉంది. అయితే కేవలం అర్బన్ రేటింగ్ చూస్తే మాత్రం ఈ సీరియలే నంబర్ 1 కావడం విశేషం. ఈ ...