Hyderabad, ఆగస్టు 21 -- స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ కు సంబంధించిన లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ గురువారం (ఆగస్టు 21) రిలీజయ్యాయి. ఈవారం కొన్ని చెప్పుకోదగిన మార్పులు చోటు చేసుకున్నాయి. టాప్ 10లో స్టార్ మాకు చెందిన ఆరు సీరియల్స్ ఉండగా.. చాలా రోజుల తర్వాత నాలుగు జీ తెలుగు సీరియల్స్ ఇందులోకి దూసుకొచ్చాయి. ఇక బ్రహ్మముడి టాప్ 10లో చోటు కోల్పోయింది.

స్టార్ మా సీరియల్స్ 32వ వారం కూడా హవా కొనసాగించాయి. అయితే టాప్ 10లో ఏడుకు బదులుగా ఈసారి ఆరు మాత్రమే చోటు దక్కించుకున్నాయి. తొలి స్థానంలో కార్తీకదీపం 2 కొనసాగుతోంది. ఈ సీరియల్ కు ఈవారం 14.42 రేటింగ్ నమోదైంది. ఇక రెండో స్థానంలో ఉన్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ 13.69 రేటింగ్ తో ఉంది.

మూడో స్థానంలోకి ఇంటింటి రామాయణం దూసుకొచ్చింది. ఈ సీరియల్ కు 12.63 రేటింగ్ వచ్చింది. గుండె నిండా గుడి గంటలు సీరియల్ నా...