భారతదేశం, నవంబర్ 6 -- స్టార్ మాతోపాటు జీ తెలుగు సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. ఈ ఏడాది 43వ వారానికి సంబంధించిన రేటింగ్స్ రాగా.. ఇందులో తొలి ఆరు స్థానాల్లో స్టార్ మా ఛానెల్ కు చెందినవే ఉన్నాయి. రేటింగ్స్, సీరియల్స్ స్థానాల్లో పెద్దగా మార్పులేవీ లేవు. మరి టాప్ 10లో ఉన్న ఆ సీరియల్స్ ఏవో చూడండి.

తెలుగు టీవీ సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ విషయానికి వస్తే స్టార్ మా ఛానెల్లో వచ్చే కార్తీక దీపం 2 సీరియల్ తన తొలి స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఈ సీరియల్ కు తాజాగా 14.36 రేటింగ్ నమోదైంది. ఇక రెండో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఉంది. దీనికి 13.84 రేటింగ్ వచ్చింది. ఇక ఇంటింటి రామాయణం సీరియల్ ఈసారి నాలుగు నుంచి మూడుకు వచ్చింది.

తాజా రేటింగ్స్ లో దీనికి 11.60 రేటింగ్ నమోదైంది. ఇక గుండె నిండా గుడి గంటలు నాలుగో స్థానానికి పడిప...