Hyderabad, జూలై 29 -- మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో బాగా పాపులర్ అయిన నటుడు సంగీత్ శోభన్. అతడు నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంబ్లర్స్ (Gamblers). ఈ సినిమా జూన్ 6న రిలీజ్ కాగా.. ఇప్పుడు ఓటీటీలోకి రావడానికి సిద్ధమవుతోంది. ఇదో కార్డ్ గేమ్ చుట్టూ సాగే ఇంట్రెస్టింగ్ మూవీ. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి.

తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ గ్యాంబ్లర్స్. సంగీత్ శోభన్ నటించిన ఈ సినిమా వచ్చే నెలలో డిజిటల్ ప్రీమియర్ కానుంది. సన్ నెక్ట్స్ ఓటీటీ ఈ సినిమాను ఆగస్ట్ 14 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది.

నిజానికి జూన్ 6నే థియేటర్లలో రిలీజైనా ఈ మూవీకి పెద్దగా ప్రమోషన్లు లేకపోవడంతో ఎవరికీ తెలియలేదు. దీంతో ఓటీటీ రిలీజ్ కూడా ఆలస్యమైంది. మొత్తానికి రెండు నెలల తర్వాత ఈ సినిమాను సన్ నెక్ట్స్ స్ట్రీమింగ్ చేయబోతోంది.

సంగీత్ శోభన్ మొదట డిజిటల్ స్పేస్ లో తన టాలెంట్ ...