Hyderabad, ఆగస్టు 26 -- తెలుగు క్రైమ్ కామెడీ మూవీ భాగ్ సాలే రెండేళ్ల కిందట అంటే జులై, 2023లో థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీ నెల రోజుల్లోనే ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. అయితే ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీ కూడా ఈ సినిమాను ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ విషయాన్ని మంగళవారం (ఆగస్ట్ 26) ఆ ఓటీటీ వెల్లడించింది.

కీరవాణి తనయుడు శ్రీసింహా లీడ్ రోల్లో నటించిన మూవీ భాగ్ సాలే. దర్శకుడు ప్రణీత్ బ్రాహ్మండపల్లి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నేహా సోలంకి ఫిమేల్ లీడ్ గా నటించింది. రాజీవ్ కనకాల, జాన్ విజయ్, వర్షిణి సౌందరరాజన్, నందిని రాయ్, హర్ష చెముడు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. బిగ్ బెన్ సినిమాస్, సినీవాలి మూవీస్ తో కలిసి వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ చిత్రాన్ని నిర్మించింది.

ఇప్పుడీ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో గురువారం (ఆగస్ట...