Hyderabad, ఆగస్టు 5 -- తెలంగాణ బ్యాక్‌డ్రాప్ లో వచ్చిన మరో కామెడీ మూవీ బద్మాషులు. ఈ ప్రాంతంలోని ఓ తిట్టునే మూవీ టైటిల్ గా తీసుకొచ్చారు. ఈ ఏడాది జూన్ లో రిలీజైన ఈ మూవీ ఇప్పుడు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఈటీవీ విన్ ఓటీటీ ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ చేయనుంది. ఆ వివరాలు చూడండి.

తెలంగాణ బ్యాక్‌డ్రాప్ లో వచ్చిన కామెడీ మూవీ బద్మాషులు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఈ సినిమాను శుక్రవారం (ఆగస్ట్ 8) నుంచి ఈటీవీ విన్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతోంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ మంగళవారం (ఆగస్ట 5) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

"ఫన్, ఫ్రెండ్షిప్, ఫుల్ కామెడీ.. బద్మాషులు ఆగస్ట్ 8 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది" అనే క్యాప్షన్ తో ఈ విషయం తెలిపింది. జూన్ 6న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి ఓ మోస్తరు రెస్పాన్స్ రాగా.. రెండు నెలల తర్వాత ఓటీటీలో...