భారతదేశం, డిసెంబర్ 10 -- కమెడియన్ సత్య, డైరెక్టర్ రితేష్ రానా కాంబినేషన్ లో వచ్చిన మత్తు వదలరా రెండు సినిమాలూ ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనకు తెలుసు. ఇప్పుడీ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. ఈసారి జెట్లీ (Jetlee) పేరుతో ఓ మూవీ వస్తోంది. అందులో హీరోయిన్ గా మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘాను పరిచయం చేశారు.

మత్తు వదలరా, మత్తు వదలరా 2.. రెండు సినిమాలూ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కామెడీకి థ్రిల్ జోడించి తీసిన ఈ మూవీస్ తో డైరెక్టర్ రితేష్ రానా తనకంటూ ప్రత్యేక గుర్తింపు చాటుకున్నాడు. ఇప్పుడతడు ఆ రెండు సినిమాల్లో ప్రధాన పాత్ర పోషించిన కమెడియన్ సత్యనే లీడ్ రోల్లో పెట్టి జెట్లీ అనే మూవీ చేస్తున్నాడు. మంగళవారం (డిసెంబర్ 9) అతని క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘాను మూవీలో ఫిమేల్ లీడ్ గా పరిచయం చేస...