భారతదేశం, డిసెంబర్ 14 -- ప్రేక్ష‌కుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు వైవిధ్య‌మైన కంటెంట్‌తో మెప్పిస్తూ ఇండియాలో అతిపెద్ద ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఒకటిగా నిలుస్తోంది జీ5 సంస్థ. మ‌రోసారి త‌న‌దైన శైలిలో డిఫరెంట్ తెలుగు ఒరిజిన‌ల్ ఓటీటీ సిరీస్‌తో ఆడియెన్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది జీ5.

ఆ ఓటీటీ సిరీసే 'న‌య‌నం'. వ‌రుణ్ సందేశ్‌, ప్రియాంక జైన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సిరీస్‌లో అలీ రెజా, ఉత్తేజ్, రేఖా నిరోషా త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో నటించారు. డిసెంబర్ 19 నుంచి జీ5లో నయనం ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

స్వాతి ప్రకాష్ దర్శకత్వం వహించిన సైకో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ నయనం ట్రైలర్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన నయనం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో జీ5 ఓటీటీ తెలుగు కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ సాయి తేజ దేశరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

సాయి తేజ దేశరాజ...