భారతదేశం, నవంబర్ 15 -- ఎస్.ఎస్. రాజమౌళి తదుపరి చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్లోబ్‌ట్రాట‌ర్ ఈవెంట్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ చిత్రానికి 'వారణాసి' అనే టైటిల్ ఖరారు అయినట్లు సమాచారం. చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈవెంట్‌కు హాజరయ్యారు. వీళ్లను చూసి అభిమానులు కేరింతలు కొట్టారు.

ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న ప్రియాంక చోప్రా ఈ సందర్భంగా తెల్లటి దుస్తుల్లో అందరినీ మంత్రముగ్ధులను చేశారు. గ్లోబ్‌ట్రాట‌ర్ ఈవెంట్‌లోకి అడుగుపెడుతూ ఆమె నమస్కారం చేసి, అభిమానులను పలకరించారు. ప్రియాంక తెల్లటి లెహంగా దుస్తుల్లో ఎంతో అందంగా కనిపించారు. వాటికి సంప్రదాయ ఆభరణాలను జోడించారు. ఆమె లుక్ తెగ వైరల్ అవుతోంది. ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి.

నటి లుక్‌పై స్పందిస్తూ ఒక అభిమాని ఇలా వ్యాఖ్యానించారు. "ప్రియాంక ఒక ...