Hyderabad, అక్టోబర్ 9 -- తెలుగు టీవీ సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి. 39వ వారానికిగాను వీటిని రిలీజ్ చేశారు. టాప్ 10 సీరియల్స్ లో మొదటి ఆరు స్థానాల్లో స్టార్ మాకు చెందిన సీరియల్సే ఉన్నాయి. కార్తీక దీపం 2 సీరియల్ రేటింగ్ కాస్త తగ్గినా నంబర్ 1 తెలుగు సీరియల్ గా కొనసాగుతోంది.

39వ వారం తెలుగు టీవీ సీరియల్స్ లో స్టార్ మా సీరియల్స్ హవా కొనసాగింది. టాప్ 6లో మొత్తం ఆ ఛానెల్ కు చెందినవే ఉన్నాయి. 13.45 రేటింగ్ తో కార్తీక దీపం 2 తొలి స్థానంలో కొనసాగుతోంది. ఒకప్పుడు 15 దాటిన రేటింగ్ ఇప్పుడు చాలా తగ్గినా.. మిగిలిన సీరియల్స్ తో పోలిస్తే ఇంకా మెరుగ్గానే ఉంది. ఇక రెండో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఉంది. దీనికి తాజాగా 13.08 రేటింగ్ నమోదైంది. మూడో స్థానంలో గుండె నిండా గుడి గంటలు కొనసాగుతోంది.

ఈ సీరియల్ కు 39వవారం 11.25 రేటింగ్ నమోదై...