భారతదేశం, అక్టోబర్ 27 -- మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తనయుడిగా చిత్రసీమలో అడుగు పెట్టిన హీరో ప్రణవ్ మోహన్ లాల్. మోహన్ లాల్ కుమారుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రణవ్ మోహన్ లాల్ అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు.

మలయాళంలో సూపర్ హిట్ మూవీ'హృదయం'తో భాషలకు అతీతంగా ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్నారు. ఇప్పుడు ప్రణవ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'డియాస్ ఇరాయ్'. మిస్టరీ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల కానుంది.

తెలుగు రాష్ట్రాల్లో డియాస్ ఇరాయ్ సినిమాను సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేస్తోంది. ఈ సినిమాతో తెలుగులో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్. దీంతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవుతోంది.

అయితే, కమల్ హాసన్ 'పుష్పక విమానం', '...