భారతదేశం, జూలై 15 -- మ‌ల‌యాళం డార్క్ కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ ప‌ట్ట‌ప‌క‌ల్ తెలుగులో రిలీజైంది. ప‌ట్ట‌ప‌గ‌లు పేరుతో సైనా ప్లే ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో కృష్ణ శంక‌ర్‌, సుధి కొప్ప, జాన్ ఆంటోనీ కీల‌క పాత్ర‌లు పోషించారు. సాజీర్‌ స‌దాఫ్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

గ‌త ఏడాది జూన్‌లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ ఏడాది త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. ఈ సినిమా ర‌న్ టైమ్ కేవ‌లం గంట‌న్న‌రే. నాన్ లీనియ‌ర్ స్క్రీన్‌ప్లేతో ద‌ర్శ‌కుడు సాజీర్ స‌దాఫ్ ప్ర‌యోగాత్మ‌కంగా ఈ సినిమాను తెర‌కెక్కించాడు. కామెడీ వ‌ర్క‌వుట్ అయినా క‌న్ఫ్యూజింగ్ స్క్రీన్‌ప్లే కార‌ణంగా ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది.

మినిస్ట‌ర్ కు చెందిన కొన్ని కీల‌క‌మైన డాక్యుమెంట్స్‌, వీడియోల‌ను కార్లోస్ అనే గ్యాంగ్‌స్ట‌ర్‌ దొంగ‌త‌నం చేస్తాడు. మినిస్ట‌ర్ తాలూకూ సీ...