భారతదేశం, మే 21 -- మ‌ల‌యాళం హార‌ర్ మూవీ కూర తెలుగులోకి డ‌బ్ అయ్యింది. ఓ స్త్రీ పేరుతో ఈ మూవీ రిలీజైంది. థియేట‌ర్‌, ఓటీటీల‌లో కాకుండా నేరుగా యూట్యూబ్‌లో విడుద‌లైన ఈ మూవీ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి రెంట‌ల్ ఛార్జీలు లేకుండా ఓ స్త్రీ మూవీని యూట్యూబ్‌లో ఉచితంగా చూడొచ్చు.

ఓ స్త్రీ మూవీలో కీర్తి ఆనంద్‌, వ‌ర్ధిక్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. సందేశ్ స‌త్య‌న్‌, అప‌ర్ణ మీన‌న్ , శోభీంద్ర‌న్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సినిమాకు వైశాగ్ జోజ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 2021లో మ‌ల‌యాళంలో రిలీజైన ఈ మూవీ ద్వారా హీరోహీరోయిన్ల‌తో పాటు 30 మంది న‌టీన‌టులు ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టారు.

రెగ్యుల‌ర్ హార‌ర్ థ్రిల్ల‌ర్ సినిమాల‌కు భిన్న‌మైన కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు ఈ మూవీని తెర‌కెక్కించాడు. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ షాకింగ్‌గా ఉంటుంది. మ‌ల‌యాళం వెర్ష‌న్ కూ...