భారతదేశం, జనవరి 24 -- రీసెంట్ గా జపాన్ లో పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హీరో హీరోయిన్లు అల్లు అర్జున్, రష్మిక మందన్న ఆ దేశంలో సందడి చేశారు. అక్కడి ఫ్యాన్స్ తో ముచ్చటించారు. ఆ సందర్భంగా ఓ జపాన్ అభిమాని తెలుగులో మాట్లాడి అల్లు అర్జున్, రష్మిక మందన్నకు షాకిచ్చాడు. ఆ ఫ్యాన్ తెలుగులో మాట్లాడటంతో అల్లు అర్జున్ అవాక్కయ్యాడు. ఈ వీడియో ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది.

ఒక జపనీస్ అభిమాని అనర్గళంగా తెలుగులో పలకరించి, వాళ్ల నటనను ప్రశంసించినప్పుడు అల్లు అర్జున్, రష్మిక మందన్న ఆశ్చర్యపోయారు. ఈ సంభాషణకు సంబంధించిన వీడియోను ఆ ఫ్యాన్ ఇటీవల సోషల్ మీడియాలో పంచుకున్నాడు. కజు అనే అభిమాని.. అర్జున్, రష్మికతో పుష్ప 2 సినిమాకి తగ్గేదేలే పోజులో ఫొటో దిగాడు.

అల్లు అర్జున్, రష్మికతో దిగిన ఫొటోను కజు తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. దానిని పోస్ట్ చేస్తూ.. "భారతదేశంలో...