Hyderabad, జూలై 31 -- తెలుగులో మరో పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రానుంది. వచ్చే నెల తొలి వారంలోనే స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను గురువారం (జులై 31) మేకర్స్ రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇద్దరు అత్యంత శక్తివంతమైన నేతలైన చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితాలు, వారి స్నేహం, రాజకీయ వైరాలను పోలి ఉన్న ఈ సిరీస్ పేరు మయసభ.

మయసభ వెబ్ సిరీస్ టీజర్ ఈ నెల మొదట్లోనే రిలీజైన విషయం తెలిసిందే. ఆ టీజర్ వచ్చినప్పుడే దీనిని చంద్రబాబు, వైఎస్ ఆధారంగా తెరకెక్కించినట్లు తేలిపోయింది. మేకర్స్ అధికారికంగా అదే స్టోరీ అని చెప్పకపోయినా.. కథ మొత్తం వాళ్లదే. ఇప్పుడీ ట్రైలర్ కూడా అలాగే సాగింది. ఇందులో కృష్ణమ నాయుడు, ఎంఎస్ రామిరెడ్డి పాత్రల్లో ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించారు. ఈ ట్రైలర్ మొదట్లోనే రామిరెడ్డి తండ్రి హత్యకు గురైనట్ల...