భారతదేశం, ఫిబ్రవరి 18 -- జీ తెలుగులో ప్రసారమవుతున్న కొత్త డ్యాన్స్ షో 'ఆట' (Aata) ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో గెస్ట్‌గా వచ్చిన లావణ్య త్రిపాఠి, జడ్జిగా ఉన్న నిహారికల మధ్య జరిగిన సరదా సంభాషణ, వరుణ్ తేజ్‌తో ఫోన్ కాల్ ఎపిసోడ్ ప్రేక్షకులను నవ్విస్తోంది. చెల్లి ఫోన్ కట్ చేసి భార్య ఫోన్ ఎత్తిన వరుణ్ తేజ్ చెప్పిన కారణం హైలైట్‌గా నిలిచింది.

జీ తెలుగు ఛానెల్‌లో ప్రారంభమైన కొత్త డ్యాన్స్ షో 'ఆట'. ఈ షోకి యాంకర్ సుధీర్ హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా, మెగా డాటర్ నిహారిక కొణిదెల జడ్జిగా ఉంది. తాజాగా విడుదలైన ప్రోమోలో మెగా కోడలు లావణ్య త్రిపాఠి గెస్ట్‌గా వచ్చింది. ఈ ఎపిసోడ్‌లో జరిగిన ఒక ఫన్ గేమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

షో ప్రారంభంలో నిహారిక.. లావణ్యను ఆలింగనం చేసుకుని స్వాగతం పలికింది. యాంకర్ సుధీర్ నిహారికను ఉద్దేశించి.. "వదిన...