భారతదేశం, ఏప్రిల్ 23 -- మ‌ల‌యాళం పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ జ‌నాధీప‌న్ మూవీ తెలుగులోకి వ‌చ్చింది. జ‌న‌సేనాని పేరుతో డ‌బ్ అయిన ఈ మూవీ ఓటీటీలో కాకుండా నేరుగా యూట్యూబ్‌లో రిలీజైంది. ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది.

జ‌న‌సేనాని మూవీలో హ‌రీష్ పేర‌డి, విను మోహ‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీకి త‌న్సీర్ ఎమ్ ఏ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.కేర‌ళ‌కు సీఏం అయిన ఓ క‌మ్యూనిస్ట్ పార్టీ లీడ‌ర్ జీవితంలో ఎదురైన సంఘ‌ట‌న‌ల నుంచి స్ఫూర్తి పొందుతూ ద‌ర్శ‌కుడు ఈ మూవీని తెర‌కెక్కించాడు.

జ‌నాధీప‌న్ మూవీ 2019లో మ‌ల‌యాళంలో రిలీజైంది. ఈ సినిమా ట్రైల‌ర్‌, టీజ‌ర్‌లో సీఏం పాత్ర‌ను నెగెటివ్ షేడ్స్‌లో చూపించ‌డంపై మ‌ల‌యాళంలో విమ‌ర్శ‌లొచ్చాయి. ఓ ఫేమ‌స్ పొలిటిక‌ల్ లీడ‌ర్ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో ఉన్న అభిమానాన్ని, ఆయ‌న‌కు ఉన్న పాపులారిటీకి వ్య‌తిరేకంగా తీసిన సినిమా...