భారతదేశం, మే 3 -- ఫ‌హాద్ ఫాజిల్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన మ‌ల‌యాళం మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ ఇరుల్ తెలుగులోకి వ‌స్తోంది. అప‌రాధి పేరుతో తెలుగులోకి డ‌బ్ అవుతోన్న ఈ మూవీ నేరుగా ఆహా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఈ విష‌యాన్ని ఆహా ఓటీటీ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. ఈ సినిమా పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్న‌ది. త్వ‌ర‌లోనే అప‌రాధి మూవీ స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు వెల్ల‌డించింది.

అప‌రాధి మూవీలో ఫ‌హాద్ ఫాజిల్‌తో పాటు ద‌ర్శ‌న రాజేంద్ర‌న్‌, సౌబీన్ షాహిర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈ సినిమా మొత్తం ఒకే ఇంట్లో కేవ‌లం మూడు పాత్ర‌ల‌తోనే ప్ర‌యోగాత్మ‌కంగా తెర‌కెక్క‌డం గ‌మ‌నార్హం. మ‌ల‌యాళంలో ఇరుల్ పేరుతో రిలీజైన ఈ మూవీలో ఫ‌హాద్ ఫాజిల్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో క‌నిపించాడు. ఇరుల్ మూవీ కొవిడ్ కార‌ణంగా మ‌ల‌యాళంలో కూడా నేరుగా ఓటీటీలోనే రిలీజైంది. ఈ ...