Hyderabad, ఆగస్టు 3 -- హీరో శ్రీరామ్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం 'మాతృ'. ఈ సినిమాలో సుగి విజయ్, రూపాలీ భూషణ్ జంటగా నటించారు. వీరితోపాటు తెలుగు టాప్ కమెడియన్ అలీ, సీనియర్ హీరోయిన్ ఆమని, నటులు రవి కాలే, పృథ్వీ రాజ్, దేవి ప్రసాద్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 కంటెస్టెంట్, హీరోయిన్ నందినీ రాయ్ ముఖ్య భూమికలు పోషించారు.

మాతృ చిత్రాన్ని శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్‌పై బూర్లె శివ ప్రసాద్ ప్రతిష్ఠాతకంగా నిర్మించారు. సైంటిఫిక్ థ్రిల్లర్ కథనంతో దర్శకుడు జాన్ జాక్కి మాతృ సినిమాను తెరకెక్కించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మాతృ చిత్రం ఆగస్ట్ 8న థియేటర్‌లో విడుదల కానుంది.

ఇప్పటికే మాతృ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయింది. అయితే, మాతృ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన సందర్భంగా ఇంట్రెస్టింగ్ విశేషాలను పంచుకున్నారు నిర్మాత బి...