భారతదేశం, మే 31 -- క‌న్న‌డ మూవీ మార్టిన్ తెలుగు వెర్ష‌న్ యూట్యూబ్‌లో రిలీజైంది. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. మార్టిన్ మూవీలో ధృవ్ స‌ర్జా హీరోగా న‌టించాడు. వైభ‌వి శాండిల్య‌, అన్వేషి జైన్ హీరోయిన్లుగా న‌టించారు. ఏపీ అర్జున్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

మార్టిన్ మూవీకి సీనియ‌ర్ హీరో అర్జున్ క‌థ‌ను అందించాడు. గ‌త ఏడాది థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ క‌న్న‌డంలో బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్స్‌లో ఒక‌టిగా నిలిచింది. దాదాపు 150 కోట్ల బ‌డ్జెట్ రూపొందిన ఈ మూవీ 27 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. క‌న్న‌డంలో ఓ మోస్తారు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ మూవీ తెలుగులో బాక్సాఫీస్ వ‌ద్ద ఏ మాత్రం ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోయింది.

క‌థే లేకుండా యాక్ష‌న్ అంశాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించాల‌నే ద‌ర్శ‌క‌నిర్మాత‌ల ప్ర‌య‌త్నం పూర్తిగా బెడిసికొట్టింది. కేజీఎఫ్...