భారతదేశం, డిసెంబర్ 16 -- నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన ఫస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ థామా. హిందీతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో ఆడియన్స్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది.

రష్మిక మందన్న ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ప్రైమ్ వీడియోలో ఎలాంటి రెంట్ చెల్లించకుండానే ఈ నేషనల్ క్రష్ లేటెస్ట్ మూవీ థామా చూసేయచ్చు. ఈ హారర్ థ్రిల్లర్ ఇవాళ (డిసెంబర్ 16) నుంచి ఆడియన్స్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. నిజానికి డిసెంబర్ 2న థామా మూవీ ఓటీటీలో రిలీజైంది. కానీ అప్పుడు రెంట్ విధానంలోనే స్ట్రీమింగ్ అయింది. అంటే ప్రైమ్ వీడియో యూజర్లు కూడా రెంట్ కోసం మనీ పే చేయాల్సి వచ్చింది. ఇప్పుడు రెంట్ కాకుండా సాధారణంగానే స్ట్రీమింగ్ అవుతోంది.

మడాక్ ఫిల్మ్స్ వారి తాజా హారర్ కామెడీ 'థామా...