భారతదేశం, నవంబర్ 20 -- ఈ వారం స్ట్రీమింగ్‌లో కొత్త సౌత్ ఇండియన్ సినిమాలు, షోలు వస్తున్నాయి. స్పోర్ట్స్ డ్రామాలు, పీరియడ్ మిస్టరీలు, తీవ్రమైన థ్రిల్లర్లు ఇలా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా తమిళ సినిమాల సందడి ఎక్కువగానే ఉండనుంది. ఇందులో ఈ రెండు సినిమాలు, సిరీస్ మిస్ కాకుండా చూసేయండి. ఇందులో ధ్రువ్ విక్రమ్ 'బైసన్' నుంచి నాడు సెంటర్ సిరీస్ వరకూ ఉన్నాయి. ఈ వారం ఓటీటీల్లో ఈ సినిమాలు, సిరీస్ ను తప్పకుండా చూసేయండి.

తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా నటించిన సినిమా 'బైసన్'. అర్జున అవార్డు గ్రహీత మనాతి గణేషన్ జీవితం ఆధారంగా ఈ గ్రిట్టీ కబడ్డీ స్పోర్ట్స్-యాక్షన్ డ్రామాను తెరకెక్కించారు. 1990ల నాటి గ్రామీణ తమిళనాడుకు చెందిన దళిత కబడ్డీ ఆటగాడు కిట్టన్ కథను ఈ చిత్రం చెప్తుంది. అతని ఎదుగుదల కుల హింస, రాజకీయ బెదిరింపులు, లోతుగా పాతుకుపోయిన వ...