Hyderabad, ఆగస్టు 28 -- తెలుగు చిత్ర పరిశ్రమలో హోల్‌సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో ఎన్నో ఘన విజయాలను అందించిన దిగ్గజ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా "వేదవ్యాస్" ఇవాళ (ఆగస్ట్ 28) హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా ప్రారంభమైంది.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ వీవీ వినాయక్, అనిల్ రావిపూడి చేతుల మీదుగా వేదవ్యాస్ సినిమాను ఘనంగా ప్రారంభించారు. వేదవ్యాస్ సినిమాను కె అచ్చిరెడ్డి సమర్పణలో సాయి ప్రగతి ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ పార్టీ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్నారు.

వేదవ్యాస్ సినిమాతో సౌత్ కొరియా నటి జున్ హ్యున్ జీ హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నారు ఎస్వీ కృష్ణారెడ్డి. ఈ చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా హీరోయిన్ జున్ హ్యున్ జీని ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ...