భారతదేశం, మే 14 -- బాలీవుడ్ హిస్టారికల్ కోర్ట్ రూమ్ డ్రామా మూవీ 'కేసరి చాప్టర్ 2' ప్రశంసలు దక్కించుకుంటోంది. అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా మంచి కలెక్షన్లను కూడా సాధిస్తోంది. ఏప్రిల్ 18న హిందీలో విడుదలైన ఈ చిత్రానికి ఇంకా థియేట్రికల్ రన్ జోరుగా సాగుతోంది. బ్రిటీషర్ల పాలన కాలంలో జరిగిన జలియన్ వాలాబాగ్ మారణహోమం బ్యాక్‍డ్రాప్‍తో ఈ మూవీ తెరకెక్కింది. హిందీలో పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్న కేసరి చాప్టర్ 2ను తెలుగులోనూ వస్తోంది.

కేసరి చాప్టర్ 2 చిత్రం తెలుగు డబ్బింగ్ వెర్షన్ థియేటర్లలో మే 23వ తేదీన విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ వెర్షన్‍ను ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‍మెంట్ రిలీజ్ చేస్తోంది. న్యాయం, పోరాటంతో సాగే పవర్‌ఫుల్ స్టోరీని మే 23వ తేదీన తీసుకొస్తున్నామంటూ నేడు (మే 14) సోషల్ మీడియాలో ఓ ప్రొడక్షన్ హౌస్ ప...