Hyderabad, ఆగస్టు 1 -- రాజు జెయ‌మోహ‌న్‌ హీరోగా ఆధ్య ప్ర‌సాద్‌, భ‌వ్య త్రిఖ హీరోయిన్లుగా తెరకెక్కిన కామెడీ చిత్రం బన్ బటర్ జామ్. ఈ సినిమాకు రాఘవ్ మిర్‌దత్ దర్శకత్వం వహించారు. సురేష్ సుబ్ర‌మ‌ణియ‌న్ స‌మ‌ర్ప‌కుడిగా రూపొందిన బన్ బటర్ జామ్ సినిమాను రెయిన్ ఆఫ్ ఎరోస్‌, సురేష్ సుబ్ర‌మ‌ణియ‌న్ నిర్మించారు.

ఫ‌న్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్‌గా ఔట్ అండ్ ఔట్ కామెడీగా తెరకెక్కిన బన్ బటర్ జామ్ తమిళంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ మూవీని తెలుగులో విడుదల చేస్తున్నారు. బన్ బటర్ జామ్ సినిమాను ఆగస్టు 8న థియేటర్లలో తెలుగు భాషలో విడుదల చేయనున్నారు.

శ్రీ విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సిహెచ్ సతీష్ కుమార్ ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం (జూలై 31) బన్ బటర్ జామ్ టీజ‌ర్‌ను టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ...