Hyderabad, ఆగస్టు 1 -- ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూసిన 'కింగ్డమ్' చిత్రం థియేటర్లలో అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషించారు.

భారీ అంచనాల నడుమ జూలై 31 విడుదలైన 'కింగ్డమ్' మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్స్ పరంగా సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ కింగ్డమ్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. "కింగ్‌డమ్ సినిమాకి వస్తున్న స్పందన పట్ల మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. యూఎస్ ప్రీమియర్ల నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. రాత్రి నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. చ...