భారతదేశం, ఆగస్టు 16 -- మనం కొన్నిసార్లు కొన్ని చిన్న విషయాలను విస్మరిస్తాం. క్రెడిట్ కార్డ్ బిల్లును సకాలంలో చెల్లించకపోవడం, ఆలోచించకుండా మరొక రుణం కోసం దరఖాస్తు చేసుకోవడం వంటివి చేస్తుంటాం. ఆ సమయంలో ఈ విషయాలు చిన్నవిగా అనిపించినా.. క్రమంగా అవి మన ఆర్థిక పనితీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. మీ ఆదాయం బాగుండవచ్చు, మీ ఖర్చులు నియంత్రణలో ఉండవచ్చు.. అయినా మీ క్రెడిట్ స్కోరు మీ అంచనాల కంటే తక్కువగా ఉండొచ్చు. ఈ సమస్యకు కారణం మీరు ఫాలో అయ్యే చిన్న అలవాట్లలో ఉంది. ఇవి మీ క్రెడిట్ స్కోర్‌ను నెమ్మదిగా దెబ్బతీస్తాయి.

సంక్షోభ సమయాల్లో క్రెడిట్ కార్డులపై మాత్రమే ఆధారపడటం సాధారణ తప్పు. ఆసుపత్రి ఖర్చులు లేదా కారు మరమ్మతులు వంటి అత్యవసర పరిస్థితులకు మీరు పదే పదే క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తే అప్పు క్రమంగా పెరుగుతుంది. ఈ అలవాటు మిమ్మల్ని అప్పుల ఊబిలోకి త...