Telangana, ఏప్రిల్ 26 -- తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 14వ తేదీ నుంచి భూ భారతి చట్టం తీసుకువచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి అనుబంధంగా భూ భారతి పోర్టల్ సేవలు ప్రారంభమైంది. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్ట్ కింద 4 మండలాల్లో ఈ పోర్టల్ ఆధారంగానే భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి.

తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ కొత్త పోర్టల్ ఆధారంగానే... రాష్ట్రంలో భూముల నిర్వహణతో పాటు రిజిస్ట్రేషన్ల వంటి ప్రక్రియలన్నీ జరుగుతాయి. ధరణి స్థానంలో వచ్చిన భూ భారతి పోర్టల్ ద్వారా పౌరులు... పలు సేవలను సులభంగా పొందే వీలు ఉంది. లావాదేవీలు మాత్రమే కాకుండా...సమాచార సేవలు కూడా ఇందులో ఉన్నాయి.

సాధారణంగా భూములకు ప్రభుత్వం మార్కెట్ వాల్యూను నిర్ధారిస్తుంది. ఆయా ప్రాంతా...