Telangana, ఏప్రిల్ 23 -- తెలంగాణలో భూ భారతి చట్టం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో ఈ సేవలు పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చాయి. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. మరోవైపు భూ భారతి చట్టంపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ అధికారులు అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు. మండలాల వారీగా వీటిని చేపడుతూ... కొత్త చట్టం ప్రయోజనాలను వివరిస్తున్నారు.

భూముల నిర్వహణతో పాటు రిజిస్ట్రేషన్ల వంటి అంశాలన్నీ కూడా భూ భారతి పోర్టల్ ఆధారంగానే జరగనున్నాయి. గతంలో ఉన్న ఆర్వోఆర్‌-2020ను రద్దు కావటంతో... భూ భారతి చట్టం ఆధారంగానే భూముల నిర్వహణ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ వంటి ప్రక్రియలో ప్రభుత్వం పలు మార్పులను కూడా తీసుకువచ్చింది.

రైతులకు ఇబ్బందులు లేకుండా కొత్త చట్టం...