భారతదేశం, మే 4 -- తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.జి గిరిజా ప్రియదర్శిని కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె....ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు.

విశాఖలో జన్మించిన జస్టిస్ గిరిజా ప్రియదర్శిని ఎన్బీఎమ్ లా కాలేజీలో న్యాయశాస్త్రంలో పట్టా, లేబర్ అండ్ ఇండస్ట్రీ లా లో మాస్టర్స్, మూడు విభాగాల్లో పీజీ పూర్తి చేశారు. 2008-2021 మధ్య అనేక జిల్లా కోర్టులకు జడ్జిగా పనిచేశారు. 2022 మార్చిలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యాయమూర్తి పనిచేసిన ఎం.జి. ప్రియదర్శినిని సుప్రీంకోర్టు కొలీజియం 2022లో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని సిఫార్సు చేసింది. ప్రియదర్శిని అక్టోబర్ 29, 2020న కరీంనగర్ జిల్లా న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.

అప్పటి నుంచి ఆమె జ...