Hyderabad, ఆగస్టు 4 -- మెగా కోడలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెలకు కీలక బాధ్యతలు వరించాయి. తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌కు సంబంధించిన ముఖ్య పదవిని ఉపాసన కొణిదెలకు అప్పగించింది రాష్ట్ర సర్కార్.

అయితే, రీసెంట్‌గా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు కొత్త స్పోర్ట్స్ పాలసీని ప్రకటించారు. ఇందులో భాగంగానే ప్రైవేట్-పబ్లిక్ పార్టనర్‌షి‌ప్‌కు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. క్రీడా రంగాలను ప్రోత్సహిస్తున్న కార్పొరేట్ సంస్థలతోపాటు ఆ రంగంలో విశేష అనుభవం ఉన్న ఓ బోర్డును ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం.

ఈ క్రమంలోనే తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్, ప్రముఖ పారిశ్రామికవేత్త సంజయ్ గొయెంకాను తెలంగాణ స్పోర్ట్స్ హబ్ గవర్నెన్స్ బోర్డుకు ఛైర్మన్‌గా ని...