Telangana,hyderabad, జూలై 16 -- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్య్యంలో రాష్ట్రంలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను బుధవారం ఖరారు చేసింది. రాష్ట్రంలో మొత్తం 31 జడ్పీ స్థానాలు, 566 ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు.. 5,773 ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్లు వెల్లడించింది.

రాష్ట్రంలో మొత్తం 12,778 గ్రామ పంచాయతీలు ఉండగా. 1.12 లక్షల వార్డులు ఉన్నట్లు ప్రభుత్వం వివరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ వెలువడనున్న నేపథ్యంలో వీటిపై ప్రకటన చేసింది.

మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం కావాలని పంచాయతీరాజ్‌ శాఖ సిబ్బందిని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఎన్నికలకు అవసరమయ్యే సామాగ్రి అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది.

Published by HT Digital Content Services with permiss...