భారతదేశం, నవంబర్ 19 -- తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తును మెుదలుపెట్టింది. గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితా సవరణకు షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 20 నుంచి 23వ తేదీ వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశాలు ఇచ్చారు.

నవంబర్ 20న ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ, తప్పుల సవరణ.

నవంబర్ 22న ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాల పరిష్కారం.

నవంబర్ 23న తుది ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణ.

డిసెంబర్ రెండో వారంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పూర్తి స్థాయి ప్రక్రియ మెుదలయ్యే అవకాశం ఉంది. రెండో వారంలో షెడ్యూల్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రజాపాలన వారోత్సవాల అనంతరం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ వారోత్సవాలు డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు జరుగుతా...