భారతదేశం, జనవరి 10 -- రాష్ట్రంలోని రెగ్యులర్‌ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ.1.02 కోట్ల ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకొస్తువస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

"రాష్ట్ర ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులందరికీ రూ. 1.02 కోట్ల ప్రమాద బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నాం. రూ. 1.02 కోట్ల ప్రమాద బీమా అమలు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్రంలోని ప్రముఖ బ్యాంకర్లతో నిర్వహించిన సంప్రదింపులు విజయవంతమయ్యాయి. ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి చేర్చే ప్రభుత్వ ఉద్యోగులను మా కుటుంబ సభ్యులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం భావిస్తోంది" అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిప...