భారతదేశం, జనవరి 16 -- తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిలు ఇప్పుడు రాష్ట్ర పారిశ్రామిక ప్రతిష్టను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) 2026 దావోస్ సదస్సు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో, మద్యం తయారీ పరిశ్రమల సంఘాలు రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు జారీ చేశాయి. సుమారు రూ. 3,900 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించకపోతే, రాష్ట్రానికి వచ్చే కొత్త పెట్టుబడులు ఆగిపోవడమే కాకుండా, ప్రస్తుతం ఉన్న ఇన్వెస్టర్ల నమ్మకం కూడా సన్నగిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి.

బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI), ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ISWAI), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ కంపెనీస్ (CIABC) సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి. తెలంగాణ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన...