భారతదేశం, జనవరి 6 -- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంక్రాంతి పండుగ సెలవులను అధికారికంగా ప్రకటించింది. జనవరి 10వ తేదీ నుంచి జనవరి 16వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, వాణిజ్య పాఠశాలలకు వర్తిస్తాయని పేర్కొంది ప్రభుత్వం. జనవరి 16వ తేదీన కనుమ రోజును పురస్కరించుకుని ఆప్షన్ హాలీడే ప్రకటించింది. ఈరోజును రైతులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకొంటారు.

జనవరి 17వ తేదీ నుంచి అన్ని పాఠశాలలు తిరిగి పారంభం అవుతాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక హాస్టళ్లలో చదవుతున్న విద్యార్థులు ఇప్పటి నుంచే ఇంటికి వెళ్లేందుకు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు తేదీలు తెలియడంతో ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

ఇక కాలేజీల విషయానికొస్తే.. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన విద్యా క్యాలెండర్ ప్రకారం.. ఇంటర్ విద్యార్థు...