Telangana, జూన్ 27 -- రాష్ట్రంలో మళ్లీ కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా వైద్యారోగ్యశాఖ నుంచి రెండు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.48 డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి ఓ నోటిఫికేషన్ రాగా. స్పీచ్‌ పాథాలజీ పోస్టుల (4) భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది.

స్పీచ్ పాథాలజీ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 4 ఖాళీలను భర్తీ చేస్తారు. జూలై 12 నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందుకు జూలై 26వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. జూలై 28 నుంచి జూలై 29 తేదీల మధ్య అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.

మల్టీజోన్ 2లోనే ఈ నాలుగు ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి నెలకు రూ. 51320- రూ.127310 మధ్య జీతం చెల్లిస్తారు. https://mhsrb.telangana.gov.in వెబ్ సైట్...