Telangana,hyderabad, జూలై 11 -- తెలంగాణ వైద్యారోగ్యశాఖలో భారీగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా పలు నోటిఫికేషన్లు కూడా జారీ అయ్యాయి. వీటిలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను భర్తీకి ఇటీవలే ప్రకటన విడుదలైంది. అయితే ఈ నోటిఫికేషన్ లో పలు మార్పులు చేస్తూ అధికారులు తాజాగా ప్రకటన విడుదల చేశారు.

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. జూలై 10వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావాలి. కానీ ఇప్పటి వరకు వెబ్ సైట్ లో అప్లికేషన్ లింక్ అందుబాటులోకి రాలేదు. ఇదే విషయంపై అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ జూలై 20వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించారు. అర్హులైన అభ్యర్థులు జూలై 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. https://mhsrb.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి ...